హమ్మయ్యా...నౌక బయలుదేరింది | Finally The ship went to Andaman | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా...నౌక బయలుదేరింది

May 21 2016 8:20 PM | Updated on Jun 1 2018 9:35 PM

ప్రయాణికులకు మూడు రోజులు నరకం చూపించిన ఎం.వి.స్వరాజ్‌దీప్ నౌక ఎట్టకేలకు శనివారం ఉదయం పదిగంటలకు విశాఖ పోర్టు నుంచి అండమాన్‌కు బయలుదేరింది

ప్రయాణికులకు మూడు రోజులు నరకం చూపించిన ఎం.వి.స్వరాజ్‌దీప్ నౌక ఎట్టకేలకు శనివారం ఉదయం పదిగంటలకు విశాఖ పోర్టు నుంచి అండమాన్‌కు బయలుదేరింది. ఈనెల 18నే బయలుదేరాల్సిన ఈ నౌక తుపాను కారణంగా మూడు రోజులుగా విశాఖ పోర్టులోనే నిలిచిపోయింది. నౌక సిబ్బంది సహా 1200 మంది మూడు రోజులుగా ఓడలోనే ఉండిపోయారు. డబ్బులు అయిపోయి.. ఆహారం అందక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తుపాను విశాఖ తీరం దాటడంతో వాతావరణం నౌక ప్రయాణానికి అనుకూలంగా మారింది.

 

Advertisement
 
Advertisement
Advertisement