కొడుకుపై తండ్రి దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మేడికపూడి మండలానికి చెందిన ఓ తండ్రి తన కన్న కుమారుడిపైనే గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు
గుంటూరు: కొడుకుపై తండ్రి దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మేడికపూడి మండలానికి చెందిన ఓ తండ్రి తన కన్న కుమారుడిపైనే గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. గత కొద్ది రోజులుగా ఆస్తి వివాదాలు వారి మధ్య నెలకొన్నాయని, తరుచూ ఎదురుబొదురు మాటలనుకునేవారని బంధువులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కూడా వారిమధ్య ఆస్తి తగాదాలే దాడికి దారి తీశాయని చెప్పారు. గొడ్డలి దాడికి గురైన కొడుకును ఆస్పత్రికి తరలించారు. వారి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.