పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య | farmer commits suicide in khammam district | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

Jun 27 2016 10:27 AM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

బూర్గంపాడు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదె సైదిరెడ్డి(41) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement