విద్యార్థిని ఆత్మహత్యపై ఎంఈఓ విచారణ | enquiry to meo about in student suside | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్యపై ఎంఈఓ విచారణ

Sep 8 2016 12:38 AM | Updated on Nov 9 2018 4:40 PM

విద్యార్థిని ఆత్మహత్యపై ఎంఈఓ విచారణ - Sakshi

విద్యార్థిని ఆత్మహత్యపై ఎంఈఓ విచారణ

మండల కేంద్రంలోని కేరళ మోడల్‌స్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని కస్తూరి అనూష ఆత్మహత్యపై బుధవారం మండల విద్యాధికారి తరి రాము విచారణ చేపట్టారు.

హాలియా
 మండల కేంద్రంలోని కేరళ మోడల్‌స్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని కస్తూరి అనూష ఆత్మహత్యపై  బుధవారం మండల విద్యాధికారి తరి రాము విచారణ చేపట్టారు. పాఠశాలలో వినాయక చవితి చందాల కోసం విద్యార్థులపై ఒత్తిడి, అనుమతి లేకుండా ఏర్పాటు, చందాల వివరాలు తదితర అంశాలపై విదార్థులను కలిసి విచారించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా చందాలను అడగడం నిబంధనలకు విరుద్ధమని విద్చార్థులపై ఒత్తిడి తేరాదని యాజమాన్యానికి సూచించారు. విచారణ అంశాలను ఉన్నతాధికారులకు అందజేనున్నట్లు తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement