గాయపడిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి | engineering student died in road accident | Sakshi
Sakshi News home page

గాయపడిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

Aug 9 2016 1:02 PM | Updated on Sep 28 2018 3:41 PM

కుషాయిగూడలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంజినీరింగ్ విద్యార్థి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

హైదరాబాద్: కుషాయిగూడలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంజినీరింగ్ విద్యార్థి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. నల్లగొండ జిల్లా మోత్కూర్ మండల కేంద్రానికి చెందిన ఎస్.మహేందర్ (20) వీబీఐటీ కాలేజిలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. మహేందర్ సోమవారం ఉదయం మరో వ్యక్తితో కలసి బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు  చనిపోగా మహేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో ఈ రోజు ఉదయం మహేందర్ చనిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement