అల్వాల్ లో కారు బీభత్సం | drunk and drive case filed on two persons | Sakshi
Sakshi News home page

అల్వాల్ లో కారు బీభత్సం

Nov 1 2016 9:15 AM | Updated on May 25 2018 2:06 PM

నగరంలోని అల్వాల్ లో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్: నగరంలోని అల్వాల్ లో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా కారులో వెళ్తున్న యువకులు ఎదురుగా వస్తున్న మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని, మద్యం మత్తులో కారును నడపటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

కారులోని వ్యక్తులతో పాటు ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు ఈ ఘటనలో గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దిపేట నుంచి కారులో నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement