శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు | dilip b bhosale visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

May 15 2016 10:08 AM | Updated on Sep 4 2017 12:10 AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ భోసలే కుటుంబసభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్ డీఐజీ ఎం. కాంతారావు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి కుటుంబసభ్యులతో శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement