కుమార్తెని చితకబాదిన తల్లి ... కేసు నమోదు | Daughter harassed by mother in mahaboobnagar | Sakshi
Sakshi News home page

కుమార్తెని చితకబాదిన తల్లి ... కేసు నమోదు

Aug 26 2015 3:59 PM | Updated on Sep 26 2018 6:09 PM

నవమాసాలు మోసి కన్న కుమార్తెను చితకబాది... వాతలు పెట్టిన సంఘటన ఆత్మకూరు మండల కేంద్రంలోని వడ్డే వీధిలో బుధవారం చోటుచేసుకుంది.

మహబూబ్‌నగర్ : నవమాసాలు మోసి కన్న కుమార్తెను చితకబాది... వాతలు పెట్టిన సంఘటన ఆత్మకూరు మండల కేంద్రంలోని వడ్డే వీధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు..వడ్డేవీధికి చెందిన అనిత, అంజి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. భర్త అంజి బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లి అక్కడే ఉన్నాడు. ఆత్మకూరులో అనిత పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది.

అయితే బుధవారం ఉన్నట్టుండి అనిత, తన కూతురు అంజలి (5)ని బాగా కొట్టి వాతలు పెట్టింది.  ఆ విషయాన్ని గమనించిన స్థానికులు అంజలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనితపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారికి చికిత్స అందించి వైద్యులు వారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement