కంటైనర్ ఢీకొని దంపతుల దుర్మరణం | Couple killed in road accident | Sakshi
Sakshi News home page

కంటైనర్ ఢీకొని దంపతుల దుర్మరణం

Jun 27 2016 7:07 PM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌గేట్ వద్ద సోమవారం సాయంత్రం కంటైనర్ ఢీకొనడంతో దంపతులు మృతిచెందారు.

 నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌గేట్ వద్ద సోమవారం సాయంత్రం కంటైనర్ ఢీకొనడంతో దంపతులు మృతిచెందారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి పంచాయతీ పలుకూరువారిపాళెం గ్రామానికి చెందిన చల్లా పోలయ్య (40), ఆయన భార్య అంకమ్మ(35) ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుకనుంచి వేగంగా వచ్చిన కంటైనర్ టోల్ ప్లాజా సమీపంలోని ఎర్రగుంట వద్ద ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటాచలం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement