వారిద్దరూ దళిత ద్రోహులే... | counter by ysrcp leaders to karem shivaji | Sakshi
Sakshi News home page

వారిద్దరూ దళిత ద్రోహులే...

Nov 22 2016 11:24 PM | Updated on Sep 4 2017 8:49 PM

వారిద్దరూ దళిత ద్రోహులే...

వారిద్దరూ దళిత ద్రోహులే...

మధురపూడి : దళితుల సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కారెం శివాజీలు.. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం తగదని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, రాజోలు నియోజవకర్గ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బాలమునికుమారి అన్నారు. రాజమ

కారెం, చంద్రబాబులపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం
మధురపూడి : దళితుల సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కారెం శివాజీలు.. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం తగదని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, రాజోలు నియోజవకర్గ కో ఆర్డినేటర్‌  బొంతు రాజేశ్వరరావు, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బాలమునికుమారి అన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు కూడా మంజూరు చేయని చంద్రబాబును సన్మానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న కారెం శివాజీ వ్యూహాత్మకంగానే సన్మాన కార్యక్రమం నిర్వహించారని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందారన్నారు. చంద్రబాబు దళితులకు చేసిన ద్రోహులను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. ఆత్మవిమర్శ చేసుకోకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని చంద్రబాబు, కారెంలకు హితవు పలికారు. లేకుంటే దళితులే తగిన బుద్ధి చెబుతారని నిర్మలకుమారి, రాజేశ్వరరావు, మునికుమారి అన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement