విద్యుదాఘాతంతో కూలీ మృతి | Coolie died with current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కూలీ మృతి

Oct 5 2016 9:44 PM | Updated on Sep 28 2018 3:41 PM

విద్యుదాఘాతంతో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

గరికపాడు (క్రోసూరు): విద్యుదాఘాతంతో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గరికపాడు గ్రామానికి చెందిన రాయపాటి కృష్ణ (37) వ్యవసాయ కూలీగా పనులు చేస్తుంటాడు. పొలంలో అరక దున్నుతుండగా కిందకి వేలాడుతున్న తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లు గమనించి సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెండాడు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు బంధువులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement