'ఇప్పుడు గల్ఫ్ బాధితులు గుర్తుకొచ్చారా?' | congress leader shabbir ali criticise cm kcr | Sakshi
Sakshi News home page

'ఇప్పుడు గల్ఫ్ బాధితులు గుర్తుకొచ్చారా?'

Nov 6 2015 6:44 PM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏడాదిన్నర తర్వాత గల్ఫ్ బాధితులు గుర్తుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏడాదిన్నర తర్వాత గల్ఫ్ బాధితులు గుర్తుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే గల్ఫ్ బాధితులపై నివేదిక ఇచ్చేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.

వేలాదిమంది గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేంద్రంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిల్సి ఉందని చెప్పారు. అయినా ఇంత వరకు ఎందుకు ఆ పనిచేయలేదని ఇప్పుడు ఓట్లు పొందేందుకే ఈ హడావుడి చేస్తున్నారని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement