breaking news
warangal bipoll
-
'ప్రజలు నాలుకలు చీరెస్తరు'
హైదరాబాద్: ఏ ఎన్నికలు వచ్చినా విజయం టీఆర్ఎస్దేనని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వరంగల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై మరిన్ని రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగానే టీఆర్ఎస్ కు భారీ స్థాయి మెజార్జీ ఖాయమవడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పరిపాలనకు నిదర్శనం అని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మాత్రం తమ వెంటే ఉన్నారని చెప్పారు.| ముఖ్యంగా అధికారం చేపట్టిన 17 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి బాటలు వేశాయని చెప్పారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శల దాడికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అని చెప్పారు. ఎంతోమంది నాయకులు తమపై వ్యక్తిగత విమర్శలకు దిగారని, ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. అడ్గగోలిగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నాలుకలు చీరేస్తారు అని చెప్తారని ఈ ఉప ఎన్నికలు రుజువు చేశాయని అన్నారు. ఈ గెలుపుతో తమపై బాధ్యత పెరిగిందని, ప్రజలకు మరిన్ని అభివృద్ధి ఫలాలు అందిస్తామని చెప్పారు. -
'మోదీ, కేసీఆర్ కళ్లు తెరిపించాలి'
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్/జనగామ: ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని, నిరంకుశ పాలన సాగిస్తున్న వారి కళ్లు తెరిపించాలని కేంద్ర మాజీ మంత్రి, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్ అన్నారు. మంగళవారం ఆయన వరంగల్ జిల్లా జనగామలో విలేకరులతో, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక ప్రచార సభలో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంత ఎంపీలు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతగానే కృషి చేశారని గుర్తు చేశారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తిస్తూ సోనియూ తెలంగాణ ఇచ్చారన్నారు. చిన్న రాష్ట్రంతో ప్రజల జీవితాలు బాగుంటాయని ఆశించామని, అయితే రాష్ట్రం ఏర్పాటై 18 నెలలు గడుస్తున్నా కేసీఆర్ ఒక్క హామీని కూడా నేరవేర్చలేదని విమర్శించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని కోరారు. కేసీఆర్‌కు, మంత్రులకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో 1,500 మంది రైతులు ఆత్మహత్య చే సుకుంటే.. వారి కుటుంబాలను నేటికీ కేసీఆర్ కానీ, మోదీ కానీ పరామర్శించలేదని విమర్శించారు. వరంగల్ ఉప ఎన్నిక ద్వారా బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పాలని, ఈ ఎన్నిక దేశప్రజలకు సంకేతంగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ప్రభుత్వ అసమర్థ పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. అనంతరం ఆయనను పార్టీ నాయకులు గజమాలతో సత్కరించి, గొంగళి, గొర్రెపిల్లను బహూకరించారు. ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు రోజీజాన్ మాట్లాడుతూ.. బీజేపీ పాలన దేశ సమైక్యతను దెబ్బతీసేలా ఉందని, మతతత్వాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు పలు హామీలిచ్చిన మోదీ వాటిని పూర్తిగా విస్మరించారని, అందుకే బిహార్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పోటీపడి నిరంకుశ పాలన సాగిస్తున్నారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని, ఓటమి భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. క్రిస్మస్ పండుగను అధికారికంగా చేస్తామని, పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చేస్తున్న ప్రకటనలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు మాట్లాడారు. ఈ సందర్భంగా సభా వేదికపై ఉన్న రైతు కొమురయ్యను అతిథులు అభినందించారు. సభలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, నాయకులు గుండె విజయరామారావు, నంది ఎల్లయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాలు బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అతి తక్కువ కాలంలో ప్రజా విశ్వాసం కోల్పోయాయని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సచిన్‌పైలట్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఇందులో భాగంగానే మేధావులు, కళాకారులు తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారన్నారు. సరైన విధానాలు లేకపోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకుపోలేకపోయారని చెప్పారు. పార్లమెంట్లో భూసేకరణ బిల్లును అడ్డుకొని దాన్ని చట్టం కాకుండా చేయడం ప్రజా విజయమని పేర్కొన్నారు. సోనియా, రాహుల్‌గాంధీల నాయకత్వంలో తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో తాము గెలుస్తామన్నారు. -
'ఇప్పుడు గల్ఫ్ బాధితులు గుర్తుకొచ్చారా?'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏడాదిన్నర తర్వాత గల్ఫ్ బాధితులు గుర్తుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే గల్ఫ్ బాధితులపై నివేదిక ఇచ్చేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. వేలాదిమంది గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేంద్రంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిల్సి ఉందని చెప్పారు. అయినా ఇంత వరకు ఎందుకు ఆ పనిచేయలేదని ఇప్పుడు ఓట్లు పొందేందుకే ఈ హడావుడి చేస్తున్నారని చెప్పారు.