ఏ ఎన్నికలు వచ్చినా విజయం టీఆర్ఎస్దేనని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వరంగల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై మరిన్ని రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగానే టీఆర్ఎస్ కు భారీ స్థాయి మెజార్జీ ఖాయమవడంతో ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: ఏ ఎన్నికలు వచ్చినా విజయం టీఆర్ఎస్దేనని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వరంగల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై మరిన్ని రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగానే టీఆర్ఎస్ కు భారీ స్థాయి మెజార్జీ ఖాయమవడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పరిపాలనకు నిదర్శనం అని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మాత్రం తమ వెంటే ఉన్నారని చెప్పారు.|
ముఖ్యంగా అధికారం చేపట్టిన 17 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి బాటలు వేశాయని చెప్పారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శల దాడికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అని చెప్పారు. ఎంతోమంది నాయకులు తమపై వ్యక్తిగత విమర్శలకు దిగారని, ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. అడ్గగోలిగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నాలుకలు చీరేస్తారు అని చెప్తారని ఈ ఉప ఎన్నికలు రుజువు చేశాయని అన్నారు. ఈ గెలుపుతో తమపై బాధ్యత పెరిగిందని, ప్రజలకు మరిన్ని అభివృద్ధి ఫలాలు అందిస్తామని చెప్పారు.