'ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్యాకేజీలు రావు' | Coastal leaders Silent over Special Package to AP, says TG Venkatesh | Sakshi
Sakshi News home page

'ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్యాకేజీలు రావు'

Aug 3 2015 12:06 PM | Updated on Mar 23 2019 9:10 PM

'ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్యాకేజీలు రావు' - Sakshi

'ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్యాకేజీలు రావు'

ఆంధ్ర, రాయలసీమ సమాంతరంగా అభివృద్ధి చెందాలని, లేకుంటే మళ్లీ ఉద్యమాలు వస్తాయని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు.

కర్నూలు: ఆంధ్ర, రాయలసీమ సమాంతరంగా అభివృద్ధి చెందాలని, లేకుంటే మళ్లీ ఉద్యమాలు వస్తాయని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కర్నూలును రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు చివరి కోరికగా ఏపీకి ప్రత్యేక హోదా హామీయిచ్చారని గుర్తుచేశారు. స్పెషల్ స్టేటస్ పై మాట్లాడుతున్న కోస్తాంధ్ర నేతలు, ప్యాకేజీపై పెదవి విప్పడం లేదని ఆక్షేపించారు. నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్యాకేజీలు కూడా ఆగిపోతాయని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement