ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్ | CM KCR visits Erravalli | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్

Jun 3 2016 8:21 PM | Updated on Jul 11 2019 7:45 PM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు.

జగదేవ్‌పూర్ (మెదక్) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో బిజీబిజీగా ఉన్న కేసీఆర్ విశ్రాంతి కోసం ఫాంహౌస్‌కు వెళ్లినట్లు తెలిసింది. సీఎం వస్తారనే సమాచారంతో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫాంహౌస్, రోడ్డు మార్గాన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం వచ్చి రాగానే తన దత్తత గ్రామాల్లో జరుగుతున్న పనులపై ఆరా తీసినట్లు తెలిసింది. ఆదివారం వరకు ఇక్కడే ఉంటారని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement