’34 గ్రామాలు లేకుండా చేయాలనుకుంటున్నారు’ | chandrababu try to grab machilipatnam port lands: perni nani | Sakshi
Sakshi News home page

’34 గ్రామాలు లేకుండా చేయాలనుకుంటున్నారు’

Jul 9 2016 3:31 PM | Updated on Sep 3 2019 8:50 PM

’34 గ్రామాలు లేకుండా చేయాలనుకుంటున్నారు’ - Sakshi

’34 గ్రామాలు లేకుండా చేయాలనుకుంటున్నారు’

ఏపీ సీఎం చంద్రబాబు భూదాహం మితిమీరిపోయిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు.

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు భూదాహం మితిమీరిపోయిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. పోర్టు పరిశ్రమల పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలు భూములు అమ్ముకోవడానికి  కుట్ర చేశారని ఆరోపించారు. మచిలీపట్నం మండలంలోని 34 గ్రామాలు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు.  బాబు తలక్రిందులుగా తపస్సు చేసినా రైతులు ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వరని చెప్పారు.

జైలుకైనా వెళ్తాం. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదన్నారు. పోర్టుకు అవసరమైన 4,800 ఎకరాల భూమి ఇవ్వడానికి రైతులు సిద్ధమని, అంతకుమించి ఒక్క ఎకరం కూడా తీసుకోవడానికి వీల్లేదన్నారు. అందులో కూడా రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టు భూముల విషయంలో చంద్రబాబుపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement