land acquisition ceiling act
-
'మడా' ముసుగులో మరో భూదోపిడీ
విజయవాడ: మచిలీపట్నం పోర్టు పేరుతో భూ దోపిడీని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నేతలు మంగళవారం సమావేశమయ్యారు. మడా (మచిలీపట్నం ప్రాంత ప్రాధికార సంస్థ) ముసుగులో ప్రభుత్వం మరో భూ దోపిడీకి యత్నిస్తోందని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. ఈ సమావేశానికి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సి.రామచంద్రయ్య, పేర్ని నాని, సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, మాజీ ఎమ్మెల్సీ విల్సన్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి 1.05 లక్షల ఎకరాలను సమీకరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
’34 గ్రామాలు లేకుండా చేయాలనుకుంటున్నారు’
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు భూదాహం మితిమీరిపోయిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. పోర్టు పరిశ్రమల పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలు భూములు అమ్ముకోవడానికి కుట్ర చేశారని ఆరోపించారు. మచిలీపట్నం మండలంలోని 34 గ్రామాలు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. బాబు తలక్రిందులుగా తపస్సు చేసినా రైతులు ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వరని చెప్పారు. జైలుకైనా వెళ్తాం. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదన్నారు. పోర్టుకు అవసరమైన 4,800 ఎకరాల భూమి ఇవ్వడానికి రైతులు సిద్ధమని, అంతకుమించి ఒక్క ఎకరం కూడా తీసుకోవడానికి వీల్లేదన్నారు. అందులో కూడా రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టు భూముల విషయంలో చంద్రబాబుపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.


