మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం! | chandra babu naidu angry on cabinet ministers | Sakshi
Sakshi News home page

మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!

Mar 2 2016 9:07 PM | Updated on Jul 28 2018 6:51 PM

మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం! - Sakshi

మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!

కేబినెట్ మంత్రులతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు.

విజయవాడ: కేబినెట్ మంత్రులతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. ప్రతిపక్షాల విమర్శలపై స్పందించలేదని మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తనపై అంతగా వ్యాఖ్యలు చేస్తే కనీసం ఎందుకు స్పందించలేదని మంత్రి గంటా శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తనపై గానీ, ఏపీ ప్రభుత్వంపై గానీ ఎవరు విమర్శలు చేసినా గట్టిగా మాట్లాడాలని, వారికి సమాధానాలివ్వాలని చంద్రబాబు హుకుం జారీ చేశారు.

కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖపై సీఎం చంద్రబాబు, కేబినెట్ మంత్రులతో చర్చించారు. ముద్రగడ తనను డిక్టేట్ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజధాని భూముల దందాపై ఓ ప్రముఖ పత్రికలో వాస్తవాలు అంటూ కథనాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంపై ఈ విషయంలో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement