బస్సును ఢీకొన్న కారు: ఐదుగురి మృతి | Car rammed in to RTC bus, 5 died | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న కారు: ఐదుగురి మృతి

May 19 2016 11:24 AM | Updated on Apr 3 2019 7:53 PM

అనంతపురం జిల్లా పట్నం గ్రామం వద్ద గురువారం ఉదయం స్విఫ్ట్ కారు ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

కదిరి: అనంతపురం జిల్లా పట్నం గ్రామం వద్ద గురువారం ఉదయం స్విఫ్ట్ కారు ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. బళ్లారికి చెందిన ఓ కుటుంబం అక్కడి నుంచి రాయచోటికి కారులో బయలుదేరింది. పట్నం గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరీశిలించారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement