రామచంద్రయ్యను అడ్డుకున్న పోలీసులు | c ramachandraiah takes on chandrababu | Sakshi
Sakshi News home page

రామచంద్రయ్యను అడ్డుకున్న పోలీసులు

Jun 15 2016 11:24 AM | Updated on Mar 19 2019 5:47 PM

ఉద్యమాన్ని అణచివేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు.

రాజమండ్రి : ఉద్యమాన్ని అణచివేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు సి.రామచంద్రయ్య వచ్చారు.

అయితే ముద్రగడను పరామర్శించేందుకు అనుమతి లేదంటూ ఆయన్ని ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సి.రామచంద్రయ్య మండిపడ్డారు. కాపు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని చంద్రబాబుపై సి.రామచంద్రయ్య నిప్పులు చెరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement