బైక్‌ను ఢీకొట్టిన బొలేరో, ముగ్గురి మృతి | bolero hits bike, three died | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన బొలేరో, ముగ్గురి మృతి

Nov 21 2016 10:38 AM | Updated on Apr 3 2019 7:53 PM

వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు.

రంగారెడ్డి: వేగంగా వెళ్తున్న బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొత్తూరుగేట్ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. శ్రీశైలం వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టినట్లు తెలిసింది.
 
ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కందుకూరు మండలవాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement