బాలాజీ జెండాకు వీడ్కోలు.. | Balaji flag | Sakshi
Sakshi News home page

బాలాజీ జెండాకు వీడ్కోలు..

Sep 27 2016 5:52 PM | Updated on Sep 4 2017 3:14 PM

మండల కేంద్రంలో తొమ్మిది రోజులుగా కొలువుదీరిన తిరుమలేశుడి జెండాకు భక్తులు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఊరేగింపు

మద్నూర్‌ :
మండల కేంద్రంలో తొమ్మిది రోజులుగా కొలువుదీరిన తిరుమలేశుడి జెండాకు భక్తులు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాలాజీ జెండా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా తిడుగుతూ భక్తుల ప్రత్యేక పూజలు అందుకుంది. గోవిందుడి నామస్మరణతో వీధివీధి మారుమోగింది. ప్రతి ఏడాది బాలాజీ జెండా 9 రోజుల పాటు ప్రతిష్టాపించిన అనంతరం కోడిచిరలో ఐదు రోజుల పాటు కొలువుదీరుతుందని జెండా కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు జెండా తరలివెళ్తుందన్నారు. జెండా వెంట భక్తులు గ్రామ పొలిమేర వరకు భజనలు చేస్తూ వెళ్లారు. 

Advertisement
 
Advertisement
Advertisement