breaking news
	
		
	
  The exposition
- 
      
                    
బాలాజీ జెండాకు వీడ్కోలు..

 మద్నూర్ :
 మండల కేంద్రంలో తొమ్మిది రోజులుగా కొలువుదీరిన తిరుమలేశుడి జెండాకు భక్తులు మంగళవారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాలాజీ జెండా మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా తిడుగుతూ భక్తుల ప్రత్యేక పూజలు అందుకుంది. గోవిందుడి నామస్మరణతో వీధివీధి మారుమోగింది. ప్రతి ఏడాది బాలాజీ జెండా 9 రోజుల పాటు ప్రతిష్టాపించిన అనంతరం కోడిచిరలో ఐదు రోజుల పాటు కొలువుదీరుతుందని జెండా కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు జెండా తరలివెళ్తుందన్నారు. జెండా వెంట భక్తులు గ్రామ పొలిమేర వరకు భజనలు చేస్తూ వెళ్లారు. - 
  
    
                
      వైభవంగా 3వ రోజు అయుత చండీ యాగం
 


