గొడ్డలితో దాడి: ఒకరు మృతి | Axe attack: One dead | Sakshi
Sakshi News home page

గొడ్డలితో దాడి: ఒకరు మృతి

Mar 25 2016 12:13 PM | Updated on Sep 3 2017 8:34 PM

వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో జరిగిన గొడవలో ఒకరు చనిపోయారు.

మైలవరం: వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో జరిగిన గొడవలో ఒకరు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాలివీ... గ్రామానికి చెందిన ఉడుమల శంకర్(48), లక్ష్మీనర్సయ్యల కుటుంబాలకు ఇంటి స్థలం విషయమై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం వారు ఘర్షనకు దిగారు. లక్ష్మీనారాయణ గొడ్డలితో శంకర్‌పై దాడి చేయటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కోవెలకుంట్ల సమీపంలోకి వెళ్లేసరికి చనిపోయాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement