అట్రాసిటి కేసు పెట్టారని.. | Atrasiti case on person depression suicide attemp | Sakshi
Sakshi News home page

అట్రాసిటి కేసు పెట్టారని..

Mar 11 2016 1:55 AM | Updated on Mar 28 2018 11:26 AM

అట్రాసిటి కేసు పెట్టారని.. - Sakshi

అట్రాసిటి కేసు పెట్టారని..

అట్రాసిటి కేసు పెట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బ్లేడ్‌తో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.

గొంతుకోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు

 తాండూరు రూరల్: అట్రాసిటి కేసు పెట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బ్లేడ్‌తో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన  తాండూరు మండలంలోని వీరారెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. రాంపూర్ అనుబంధ వీరారెడ్డిపల్లికి చెందిన సన్‌డ్రాస వెంకటప్ప కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన నల్లొల్ల వెంకటయ్యతో డ్వాక్రా రుణం విషయమై గొడవ జరిగింది. దీంతో వెంకటయ్య  వెంకటప్పతో పాటు అతడి కుటుంబీకులపై అట్రాసిటి కేసు పెట్టాడు. దీంతో వెంకటప్ప తీవ్ర మనోవేదనకు గురై గురువారం ఉదయం ఇంటి వద్ద బ్లేడ్‌తో గొంతుకొసుకున్నాడు. కుటుంబీకులు గమనించి తాండూరులోని జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

 ఈ విషయమై కరన్‌కోట్ ఎస్‌ఐ చంద్రకాంత్‌ను వివరణ కోరగా.. వెంకటప్పతో పాటు అతని సోదరిపై అట్రాసిటి కేసు నమోదు చేశామన్నారు. వెంకటయ్య సోదరికి పెళ్లి సంబంధం రావడంతో కేసు నేపథ్యంలో సంబంధం చెడిపోవడంతో వెంకటప్ప బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడని తెలిపారు. పూర్తి వివరాలు సేకరిస్తామని ఎస్‌ఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement