ప్రమాదాలు నివారించాలి | accidents are stoped | Sakshi
Sakshi News home page

ప్రమాదాలు నివారించాలి

Jul 30 2016 7:24 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఉత్తమ డ్రైవర్‌ను సన్మానిస్తున్న ఆర్‌టీఏ, ఆర్టీసీ అధికారులు - Sakshi

ఉత్తమ డ్రైవర్‌ను సన్మానిస్తున్న ఆర్‌టీఏ, ఆర్టీసీ అధికారులు

వేములవాడ రూరల్‌ : ప్రమాదాలు ముందుగా ఎవరికీ తెలియవని, అవి జరగ్గకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. ఆర్టీసీ భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా వేములవాడ డిపోలో శనివారం ప్రమాదాల నివారణలో కృషి చేసిన కార్మికులను సన్మానించారు.

  • ఆర్టీఏ నాగలక్ష్మి
  • వేములవాడ రూరల్‌ : ప్రమాదాలు ముందుగా ఎవరికీ తెలియవని, అవి జరగ్గకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. ఆర్టీసీ భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా వేములవాడ డిపోలో శనివారం ప్రమాదాల నివారణలో కృషి చేసిన కార్మికులను సన్మానించారు. డ్రైవర్‌ చేతిలోనే బస్సులోని 50మంది ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయన్నారు. వారిని సురక్షింగా గమ్యం చేర్చితేనే ఆర్టీసీపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని ఆమె తెలిపారు. డిపో మేనేజర్‌ శ్రీనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే వేములవాడ డిపో ప్రమాదరహిత డిపోగా పేరొందాలన్నారు. నిబంధనలు పాటిస్తే ఇది సాధ్యమేనని అన్నారు. గతేడాది ఆరు ప్రమాదాలు జరిగాయని, అందులో మూడు డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే జరిగాయని చెప్పారు. ఉత్తమ డ్రైవర్లుగా ఎన్నికైన ఎస్‌బీరావు, డి.చంద్రయ్య, ఎన్‌ఎస్‌రావును సన్మానించారు. సిబ్బంది శ్రీనివాస్, సం«ధ్యారాణి,  గ్యారేజ్‌ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement