ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి | acb rides on rta checkpost | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి

Aug 26 2016 12:38 AM | Updated on Aug 17 2018 12:56 PM

స్థానిక ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై రెండు నెలలు తిరక్కుండానే అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి దాడి చేశారు.

పెనుకొండ : స్థానిక ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై రెండు నెలలు తిరక్కుండానే అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి దాడి చేశారు. ఈ దాడిలో రూ.28,780 స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఏసీబీ డీఎస్పీ భాస్కరరెడ్డి నేతృత్వంలో ఆశాఖ సిబ్బంది బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం నాలుగు గంటల వరకు దాడులు కొనసాగించారు.

ఈ సందర్భంగా కార్యాలయంలో లెక్కకు రాని రూ.23,850 పాటు కార్యాలయం వెనుక దాచి ఉంచిన మరో రూ.4,930ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న ఏఎంవీఐ గాయత్రి, హోంగార్డ్‌ శివకుమార్‌తో పాటు ఆఫీస్‌ ఇన్‌చార్జ్‌ మల్లికార్జునపై కేసు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఏసీబీ డీఎస్పీ భాస్కరరెడ్డి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement