breaking news
rta checkpost
-
ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి
పెనుకొండ : స్థానిక ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై రెండు నెలలు తిరక్కుండానే అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి దాడి చేశారు. ఈ దాడిలో రూ.28,780 స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఏసీబీ డీఎస్పీ భాస్కరరెడ్డి నేతృత్వంలో ఆశాఖ సిబ్బంది బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం నాలుగు గంటల వరకు దాడులు కొనసాగించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో లెక్కకు రాని రూ.23,850 పాటు కార్యాలయం వెనుక దాచి ఉంచిన మరో రూ.4,930ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న ఏఎంవీఐ గాయత్రి, హోంగార్డ్ శివకుమార్‌తో పాటు ఆఫీస్ ఇన్చార్జ్ మల్లికార్జునపై కేసు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఏసీబీ డీఎస్పీ భాస్కరరెడ్డి తెలిపారు. -
జహీరాబాద్ చెక్ పోస్టుపై విజిలెన్స్ దాడులు
జహీరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ చెక్‌పోస్టుపై బుధవారం ఉదయం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. రామచంద్రాపురం విజిలెన్స్ సీఐ జాన్‌విక్టర్, ఎస్ఐ సదాఖలీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారి రఘునందన్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. సంవత్సరాంతం జరిగే కార్యక్రమంలో భాగంగా దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల సందర్భంగా చెక్‌పోస్టు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు.