జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 నెట్‌వర్క్ ఆస్పత్రులకు తొమ్మిది నెలలుగా ఆరోగ్య శ్రీ బిల్లులు ప్రభుత్వం నుంచి అందలేదు.
► సేవలు నిలిపివేయాలని ఆస్పత్రి యూజమాన్యాల నిర్ణయం
► బిల్లులు చెల్లించకపోవడమే కారణం..
ఎంజీఎం : జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 నెట్‌వర్క్ ఆస్పత్రులకు తొమ్మిది నెలలుగా ఆరోగ్య శ్రీ బిల్లులు ప్రభుత్వం నుంచి అందలేదు. దీనికి నిరసనగా సోమవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల ప్రతినిధులు ప్రవీణ్‌రెడ్డి, సుధీర్, కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ఏప్రిల్ 22వ తేదీనే ప్రకటించామని, అరుుతే అదే నెల 18వ తేదీన వైద్యారోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి హామీ మేరకు ఆ నిర్ణయాన్ని ఈ నెల 2వ తేదీకి వాయిదా వేశామని తెలిపారు. మంత్రి హామీ నెరవేరకపోవడంతో సోమవారం నుంచి సేవలు నిలిపివేయూలని నిర్ణరుుంచినట్లు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఇంతకాలం తాము అనేక విధాలుగా ప్రయత్నించామని, అరుునా ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. గత్యంతరం లేక ఆస్పత్రులు మూసివేసే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసి ప్రత్యక్ష ఆందోళనకు తెరదీశామని తెలిపారు.