అశ్లీల చిత్రాల పేరుతో యువతికి బెదిరింపులు | A young girl is black mailed by young man | Sakshi
Sakshi News home page

అశ్లీల చిత్రాల పేరుతో యువతికి బెదిరింపులు

Jan 5 2016 6:39 PM | Updated on Sep 18 2018 8:00 PM

అశ్లీల చిత్రాల పేరుతో యువతికి బెదిరింపులు - Sakshi

అశ్లీల చిత్రాల పేరుతో యువతికి బెదిరింపులు

అశ్లీల చిత్రాలు ఉన్నాయంటూ ఒక యువతిని బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో చోటు చేసుకుంది.

అశ్లీల చిత్రాలు ఉన్నాయంటూ ఒక యువతిని బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు సదరు యువకులను మంగళవారం వలపన్ని పట్టుకున్నారు.


వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా మలికిపురానికి చెందిన కొందరు యువకులు సఖినేటిపల్లి మండలానికి చెందిన ఓ యువతిని.. తమ వద్ద ఆమె అశ్లీల చిత్రాలు ఉన్నాయని కొద్ది రోజులుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంతే కాకుండా..విషయం పొక్కకుండా ఉండాలంటే.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరువు పోతుందని భావించిన ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకులకు రూ.పది లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.


విషయం తెలిసిన వారి కుటుంబపెద్దలు పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించడంతో బ్లాక్‌మెయిలర్లను పట్టుకునేందుకు వలపన్నారు. మలికిపురం ఎస్సై విజయబాబు తన బృందంతో మూడు రోజులుగా ఈ యువకుల కదలికలపై నిఘా పెట్టారు. వారి ఫోన్ సంభాషణలను రికార్డు చేశారు. నగదు ఇస్తామని చెప్పించి, వారిని దిండి రప్పించి, ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉందనే అనుమానం ఉండటంతో రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులను అమలాపురం డీఎస్పీ అంకయ్య ప్రశ్నించినట్టు తెలిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement