వివాహిత ఆత్మహత్య | A lady sucide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Sep 16 2016 11:39 PM | Updated on Sep 4 2017 1:45 PM

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

మండలంలోని కేశావాపురానికి చెందిన కుందూరు సంతోషి (23) శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ నర్సింహరాజు తెలిపారు

నిడమనూరు : మండలంలోని కేశావాపురానికి చెందిన కుందూరు సంతోషి (23) శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ నర్సింహరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం కేసారానికి చెందిన సంతోషికి మండలంలోని కేశవాపురానికి చెందిన కుందూరు శ్రీనివాస్‌రెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే సంతోషి కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుందని తెలిపారు. శుక్రవారం నొప్పి ఎక్కువ కావడంతో పురుగులమందు తాగిందని, బంధువులు చూసి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కాగా, మృతురాలి అన్న సైదిరెడ్డి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement