ముంబై మున్సిపల్ కమిషనర్‌గా మహిళా అధికారి | ashwini bhide appointed mumbai municipal commissioner | Sakshi
Sakshi News home page

ముంబై మున్సిపల్ కమిషనర్‌గా మహిళా అధికారి

Mar 31 2026 10:35 PM | Updated on Mar 31 2026 11:06 PM

 ashwini bhide appointed mumbai municipal commissioner

బృహన్ ముంబై నగర పాలక సంస్థ మున్సిపల్‌ కమిషనర్‌గా అశ్విని భిడే  నియామకమయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.  దీంతో ఆసియాలోనే అతిపెద్ద మున్సిపాలిటీకి  కమిషనర్‌గా వ్యవహరించనున్న మహిళ అధికారిగా  అశ్విని భిడే రికార్డు సాధించనున్నారు.      

ముంబై మేయర్ రీతూ వాడే ప్రభుత్వ నిర్ణయం  పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మహిళా కమిషనర్ ఎంపిక  "నారీ శక్తి"కి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ముంబై నగరాన్ని మరింత స్మార్ట్‌గా, పరిశుభ్రంగా మార్చడంలో ఈ నియామకం  ఎంతగానో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.  

కాగా  BMC చరిత్రలో మొట్టమొదటి మహిళా కమిషనర్‌గా సేవలు అందిస్తోన్న అశ్విని భిడే 1995 కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె గతంలో  ముంబై మెట్రోలో  2015 నుండి 2020 వరకు  రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ సేవలందించారు. కాగా ప్రస్తుతం మున్సిపల్‌ కమిషనర్‌ కోసం  నలుగురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలనలోకి రాగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతుతో అశ్విని భిడే ఎంపికయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement