వాహనం ఢీకొని బాలుడి మృతి | 9 years old boy dies in road accident | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని బాలుడి మృతి

Oct 17 2016 4:22 PM | Updated on Apr 3 2019 7:53 PM

అల్లాదుర్గం మండలం రాంపూర్ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

అల్లాదుర్గం (మెదక్ జిల్లా):  అల్లాదుర్గం మండలం రాంపూర్ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపైకి వచ్చిన బాలుడిని తూఫాన్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు పెద్దశంకరంపేటకు చెందిన నగేష్(9)గా గుర్తించారు.

పండుగ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వచ్చిన నగేష్ మార్గమధ్యంలో ఉన్న గుడికి వెళ్లాడు. దైవదర్శనానికి వెళ్లిన తల్లిదండ్రులను వదిలి ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో పెద్దశంకరంపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోన్న తూఫాన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement