శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంత్రానికి 87.0433 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.
శ్రీశైల జలాశయంలో 87 టీఎంసీల నీరు
Jan 28 2017 12:21 AM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంత్రానికి 87.0433 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తుండడంతో నీటినిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 0.197 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సాగర్‌కు 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 3,300 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 490 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయనీటిమట్టం 853.10 అడుగులుగా నమోదైంది.
Advertisement


