సూది మందు వికటించి చిన్నారి మృతి | 7 months old boy dies of 'medical negligence' | Sakshi
Sakshi News home page

సూది మందు వికటించి చిన్నారి మృతి

May 27 2016 4:23 PM | Updated on Sep 4 2017 1:04 AM

ఇంజక్షన్ వికటించి బాలుడు మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది.

కొల్చారం (మెదక్) : ఇంజక్షన్ వికటించి బాలుడు మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తేజ అనే ఏడు నెలల బాలుడికి రెండు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక డాక్టర్(ఆర్‌ఎంపీ) వద్ద ఇంజక్షన్ చేయించారు. సూది వేసిన కొద్దిసేపటికే బాలుడు ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకొని మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు డాక్టర్‌పై దాడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement