breaking news
kulcharam
-
సూది మందు వికటించి చిన్నారి మృతి
కొల్చారం (మెదక్) : ఇంజక్షన్ వికటించి బాలుడు మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తేజ అనే ఏడు నెలల బాలుడికి రెండు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక డాక్టర్(ఆర్ఎంపీ) వద్ద ఇంజక్షన్ చేయించారు. సూది వేసిన కొద్దిసేపటికే బాలుడు ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకొని మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు డాక్టర్‌పై దాడి చేశారు. -
గ్రామస్తులపై దాడి చేసిన చిరుత
-
గ్రామస్తులపై దాడి చేసిన చిరుత
మెదక్ : మెదక్ జిల్లా కొల్చారం మండలం చుక్కాపూర్లో చిరుతపులి మంగళవారం నలుగురు గ్రామస్తులపై దాడి చేసింది. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే గ్రామంలో బయటకు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులపై చిరుత మళ్లి దాడి చేసింది. అనంతరం సమీపంలోని పశువుల పాకలో నక్కింది. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే చిరుత కోసం గాలింపు జరుపుతున్న అటవీశాఖ అధికారులను సమాచారం అందించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.