గ్రామస్తులపై దాడి చేసిన చిరుత | Leopard hulchul in kulcharam village | Sakshi
Sakshi News home page

గ్రామస్తులపై దాడి చేసిన చిరుత

Dec 1 2015 9:44 AM | Updated on Sep 3 2017 1:19 PM

మెదక్ జిల్లా కొల్చారం మండలం చుక్కాపూర్లో చిరుతపులి మంగళవారం నలుగురు గ్రామస్తులపై దాడి చేసింది.

మెదక్ : మెదక్ జిల్లా కొల్చారం మండలం చుక్కాపూర్లో చిరుతపులి మంగళవారం నలుగురు గ్రామస్తులపై దాడి చేసింది. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే గ్రామంలో బయటకు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులపై చిరుత మళ్లి దాడి చేసింది. అనంతరం సమీపంలోని పశువుల పాకలో నక్కింది. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే చిరుత కోసం గాలింపు జరుపుతున్న అటవీశాఖ అధికారులను సమాచారం అందించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement