అలిపిరి మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌ | Leopard Spotted on Alipiri Path Tirumala Devotees Alerted | Sakshi
Sakshi News home page

అలిపిరి మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్‌

Oct 5 2026 6:47 AM | Updated on Oct 5 2026 6:47 AM

Leopard Spotted on Alipiri Path Tirumala Devotees Alerted

సాక్షి, తిరుపతి: అలిపిరి మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మార్గంలో చిరుత పులి సంచరిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ తెల్లవారుజామున దాని సంచారంతో ఒక్కసారిగా కలకలం రేగింది

అలిపిరి నడక మార్గంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల చిరుత తిరిగింది. మెకాలిమిట్ట ప్రాంతంలో మెట్ల పక్కన కనిపించింది. ఆ సమయంలో భక్తుల రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఆ దృశ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. దాని కదలికలను గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. నడక మార్గంలో వెళ్లే భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని..  గుంపులుగా వెళ్లాలని సూచించారు.

ఇటీవల తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో నడక మార్గాల్లో చిరుత సంచారం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. అటవీశాఖ అధికారులు చిరుత కదలికలను పరిశీలిస్తూ, భక్తుల భద్రత కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి: ఖాళీ ప్లేట్లతో పిల్లల నిరసన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement