ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలోని ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు ఆదివారం ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ఖాళీ ప్లేట్లతో ఆందోళనకు దిగారు. హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తే వార్డెన్ కొడుతున్నారని వాపోయారు. హాస్టల్ ప్రాంగణంలో తమ వార్డెన్ ఓ మహిళతో రాసలీలలు నడుపుతున్నారని, ఈ పరిణామాలు తమకు ఇబ్బందికరంగా ఉన్నాయని మరికొంతమంది విద్యార్థులు ఆరోపించారు. వార్డెన్‌ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా గతంలోనే హాస్టల్ వార్డెన్‌పై ఫిర్యాదులు రాగా, చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు రోడ్డెక్కినట్టు సమాచారం.


