58 మంది బైండోవర్‌ | 58 members bindovar | Sakshi
Sakshi News home page

58 మంది బైండోవర్‌

Sep 24 2016 12:34 AM | Updated on Jul 11 2019 8:43 PM

58 మంది బైండోవర్‌ - Sakshi

58 మంది బైండోవర్‌

మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలు జరిపిన 58 మంది పాత నేరస్తులను శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ జి.దశరథ ఎదుట ఎక్సైజ్‌ సీఐ బొడిగ అశోక్‌ బైండోవర్‌ చేశారు.

మోత్కూరు 
 మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలు జరిపిన 58 మంది పాత నేరస్తులను శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ జి.దశరథ ఎదుట ఎక్సైజ్‌ సీఐ బొడిగ అశోక్‌ బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ సీఐ మాట్లాడుతూ కేసులు నమోదై సంవత్సరం కాలం పూర్తయిన పాత నేరస్తులను తిరిగి మరో సంవత్సర కాలానికి బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. సారా తయారు చేసినా.. విక్రయించినా రూ.లక్ష జరిమానా, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఎస్‌ఐ. కె.సంతోష్‌కుమార్, కానిస్టేబుల్స్‌ కట్ట అశోక్, బి.నాగరాజు, ఎం.వెంకటేశ్వర్లు, కె.వనజాతలు ఉన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement