సంతానం కలగలేదని వ్యక్తి ఆత్మహత్య | 37 years man committed suicide he cant offspring | Sakshi
Sakshi News home page

సంతానం కలగలేదని వ్యక్తి ఆత్మహత్య

Sep 21 2017 8:14 AM | Updated on Nov 6 2018 8:08 PM

సంతానం కలగలేదని వ్యక్తి ఆత్మహత్య - Sakshi

సంతానం కలగలేదని వ్యక్తి ఆత్మహత్య

మండలంలోని పల్సి గ్రామానికి చెందిన తోట రాములు (37) సంతానం కలగడం లేదని మనస్తాపంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదిలాబాద్‌ ,కుభీర్‌(ముథోల్‌) : మండలంలోని పల్సి గ్రామానికి చెందిన తోట రాములు (37) సంతానం కలగడం లేదని మనస్తాపంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్సై కె.రమేశ్‌ తెలిపిన వివరాలు.. రాములుకు 15ఏళ్ల క్రితం సరస్వతితో వివాహమైంది. వీరికి సంతానం కలగలేదు.

మంగళవారం సరస్వతి తన పుట్టింటికి వెళ్లింది. కొంతకాలంగా సంతానం లేదని మధనపడుతున్న రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాములు భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement