జిల్లాలోని కీసర మండలం తిమ్మాయిపల్లె క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది.
ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
Jan 23 2017 5:29 PM | Updated on Aug 30 2018 4:10 PM
మేడ్చల్: జిల్లాలోని కీసర మండలం తిమ్మాయిపల్లె క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. కీసర వైపు స్కూటర్‌పై వెళ్తున్న ముగ్గురిని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతులు బాలాజీనగర్‌కు చెందిన డీ హనుమంతు(26), బీ హనుమంతు(25), బూరుగుపల్లికి చెందిన శ్రీనివాస్(25)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ట్యాంకర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Advertisement


