రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి | 2 young man dies in road accident at karimnagar district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

Jul 25 2016 10:48 AM | Updated on Aug 30 2018 4:07 PM

గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

జమ్మికుంట: గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న క్రాంతి(25), శ్రీనివాస్(23) బైక్ పై వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement