'ఇది ప్రజాస్వామ్య ఖూనీ' | 144 section at beluguppa where is ysrcp mahadharna | Sakshi
Sakshi News home page

'ఇది ప్రజాస్వామ్య ఖూనీ'

Sep 16 2015 7:43 AM | Updated on Oct 30 2018 5:12 PM

అనంతపురం జిల్లాలోని బెలుగుప్పలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బెలుగుప్ప: అనంతపురం జిల్లాలోని బెలుగుప్పలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ  ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వేధింపులకు నిరసనగా నేడు బెలుగుప్పలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మహా ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ధర్నాను భగ్నం చేయాలని టీడీపీ, పోలీసులు ఎత్తుగడ వేశారు. పయ్యావుల ఆదేశాలతో టీడీపీ వర్గీయులు పోటీ ధర్నాకు పిలుపునిచ్చారు.

దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ ధర్నాలకు అనుమతి లేదని కల్యాణ దుర్గం డీఎస్పీ అనిల్ చెప్పారు. బెలుగుప్పలో 144 సెక్షన్ విధించారు. వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పోలీసుల తీరుపై విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.


 

Advertisement
 
Advertisement
Advertisement