12 మంది విద్యార్థినులకు అస్వస్థత | 12 students are ill | Sakshi
Sakshi News home page

12 మంది విద్యార్థినులకు అస్వస్థత

Aug 3 2017 1:20 PM | Updated on Sep 11 2017 11:11 PM

కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

ఖమ్మం: కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఎన్కూరులో గురువారం వెలుగుచూసింది. స్థానిక కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు రాత్రి భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొత్త బియ్యంతో వంట చేయడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు అంటున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement