12 మంది మట్కా బీటర్ల అరెస్ట్‌ | 12 gamblers arrest in hindupur | Sakshi
Sakshi News home page

12 మంది మట్కా బీటర్ల అరెస్ట్‌

Oct 8 2016 12:06 AM | Updated on Oct 16 2018 2:30 PM

పట్టణంలోని మట్కా స్థావరాలపై దాడులు జరిపి 12 మంది మట్కాబీటర్లను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు.

హిందూపురం అర్బన్ : పట్టణంలోని మట్కా స్థావరాలపై దాడులు జరిపి 12 మంది మట్కాబీటర్లను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. హిందూపురం వ¯ŒSటౌ¯ŒS పోలీసుస్టేష¯ŒSలో ఆయన వివరాలు వెల్లడించారు. శుక్రవారం సీఐ ఈదుర్‌బాషా ఆధ్వర్యంలో ఎస్‌ఐలు దిలీప్‌కుమార్, మహబూబ్‌బాషాలు మేళాపురం బైలు ఆంజనేయస్వామి ఆలయం వద్ద మట్కా నిర్వహిస్తున్న దాడులు నిర్వహించి అహ్మద్‌నగర్‌ వలి, మేలాపురం అంజి, బిలాద్, రవికుమార్, చోళసముద్రం ఆంజినేయులు, సత్యసాయినగర్‌ శ్రీనివాసులు, కొట్నూరు అశ్వర్థనారాయణ, రషీద్, సంజీవప్ప, మిలాద్‌నగర్‌ ఆదినారాయణ, ఆర్టీసీకాలనీ అతావుల్లాలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2,25,220 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. పరారైన మట్కా ఆర్గనైజర్‌ చికె¯ŒS బాబా కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐలు మధుభూషణ్, రాజగోపాల్‌నాయుడు ఎస్‌ఐలు దిలీప్, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement