1,176 క్వింటాళ్ల విత్తన కాయల పంపిణీ | 1176 quintels seeds distribution | Sakshi
Sakshi News home page

1,176 క్వింటాళ్ల విత్తన కాయల పంపిణీ

Jul 1 2017 12:11 AM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లా వ్యాప్తంగా 1,047 మంది రైతులకు 1,176 క్వింటాళ్ల సబ్సిడీ విత్తన కాయలు శుక్రవారం 32వ రోజు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా వ్యాప్తంగా 1,047 మంది రైతులకు 1,176 క్వింటాళ్ల సబ్సిడీ విత్తన కాయలు శుక్రవారం 32వ రోజు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 2,79,903 మంది రైతులకు 3,22,577 క్వింటాళ్లు అందజేశామన్నారు. 18,893 మంది రైతులకు 2,158 క్వింటాళ్లు కందులు, 39,891 మంది రైతులకు 73,283 బహుధాన్యపు కిట్లు అందజేశామన్నారు. ఎంవీకేల ద్వారా 46,816 క్వింటాళ్లు వేరుశనగ, 46,221 కిట్లు ఇచ్చామన్నారు.  శనివారం కూడా విత్తన పంపిణీ కొనసాగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement