నెక్లెస్‌ రోడ్డు ఘటన.. యువకుడు మృతి | A Young Man Died In Necklace Road Accident In Hyderabad | Sakshi
Sakshi News home page

నెక్లెస్‌ రోడ్డు ఘటన.. యువకుడు మృతి

Jun 15 2019 8:53 AM | Updated on Jun 15 2019 8:58 AM

A Young Man Died In Necklace Road Accident In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నెక్లెస్‌రోడ్డులో రెండ్రోజుల కిత్రం జరిగిన గొడవలో ప్రియుడి(మోబిన్‌) చేతిలో గాయపడ్డ సాయి సాగర్‌ (21) శనివారం మృతిచెందాడు. పోలీస్‌స్టేషన్‌లోనే సాయి సాగర్‌పై మోబిన్‌ పిడి గుద్దులతో ఎటాక్ చేశాడని, సీసీ పుటేజ్‌ ఇవ్వకుండా పోలీసులు అతనికి సపోర్ట్ చేస్తున్నారని మృతుడి స్నేహితులు అంటున్నారు. ఇప్పటికే మోబిన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతనిపై 16 కేసులు నమోదు అయినట్లు, మిర్యాలగూడలో కేసులతో పాటుగా పీడీ యాక్ట్‌లో మోబిన్‌ అరెస్టయ్యాడు.

బర్త్‌డే పార్టీ చేసుకోవడానికి నెక్లెస్‌రోడ్డుకు వెళ్లిన సాయి సాగర్‌ స్నేహితుల బృందం.. అక్కడి ఓ ప్రేమజంటతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు వర్గాలకు చెందిన నలుగురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, అప్పటివరకు బాగానే ఉన్న సాయిసాగర్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే చికిత్స పొందుతున్న సాయి సాగర్‌ మృతి చెందాడు. సాయి సాగర్‌కు ఇరవై రోజుల కిత్రమే వివాహమైనట్లు స్నేహితులు పేర్కొన్నారు.

చదవండి : నెక్లెస్‌ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..!

Advertisement
 
Advertisement
Advertisement