పోలీసుల కస్టడీలో యోగేంద్ర యాదవ్‌ | YOGENDRA YADAV DETAINED AND TAKEN INTO POLICE CUSTODY IN TAMIL NADU | Sakshi
Sakshi News home page

పోలీసుల కస్టడీలో యోగేంద్ర యాదవ్‌

Sep 9 2018 3:41 AM | Updated on Sep 9 2018 3:41 AM

 YOGENDRA YADAV DETAINED AND TAKEN INTO POLICE CUSTODY IN TAMIL NADU - Sakshi

స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌

తిరువణ్ణామలై: సేలం–చెన్నై 8 వరుసల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ను తమిళనాడు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగమ్‌ వద్దకు చేరుకున్న తనతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనీ, దాడికి పాల్పడ్డారని యోగేంద్ర ట్విట్టర్‌లో తెలిపారు. ‘ఆందోళనకారుల ఆహ్వానం మేరకు సంఘీభావం తెలిపేందుకు మేమిక్కడికి చేరుకున్నాం. కానీ రైతులను కలుసుకునేందుకు వెళ్లకుండా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మాపై దాడిచేస్తూ వ్యాన్లలోకి తోశారు’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement